మాస్కో చేరుకున్న చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన మూడు రోజుల రష్యా పర్యటనలో భాగంగా సోమవారం మాస్కోకు చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్న వేళ.. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు అధినేతలూ సోమవారం రాత్రి చర్చలు జరిపారు.
రష్యాతో బలమైన బంధమే లక్ష్యం
మాస్కో, బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన మూడు రోజుల రష్యా పర్యటనలో భాగంగా సోమవారం మాస్కోకు చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్న వేళ.. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు అధినేతలూ సోమవారం రాత్రి చర్చలు జరిపారు. తమ మధ్య గల ‘హద్దుల్లేని స్నేహబంధం’ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా జిన్‌పింగ్ పర్యటన సాగుతుందని చైనా, రష్యాలు అభివర్ణించాయి. తమ దేశ ఇంధన అవసరాలైన ముడిచమురు, గ్యాస్‌లకు రష్యాను ప్రధాన వనరుగా చైనా భావిస్తోంది. అలాగే అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించడంలో భాగస్వామిగాను లెక్కిస్తోంది. అధికారులతో కూడిన విస్తృత చర్చలు మంగళవారం జరుగుతాయి. ఉక్రెయిన్ నుంచి వేల మంది చిన్నారులను అపహరించారన్న ఆరోపణలతో పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీచేసిన రోజుల వ్యవధిలోనే జిన్‌పింగ్ పర్యటన సాగుతుండటం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Periodic Table: పిరియాడిక్ టేబుల్‌ను ఎందుకు తొలగించామంటే..? NCERT వివరణ
-
Sports News
WTC Final: అశ్విన్ తుది జట్టులో ఉంటాడా... లేదా? ఆస్ట్రేలియా శిబిరంలో ఇదే హాట్ టాపిక్!
-
World News
Putin: చర్చితో సంబంధాలు బలపర్చుకొనే యత్నాల్లో పుతిన్..!
-
Crime News
Hyderabad: కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. రెండేళ్ల చిన్నారి మృతి
-
Movies News
Nenu student sir movie review: రివ్యూ: నేను స్టూడెంట్ సర్
-
General News
Amaravati: లింగమనేని రమేశ్ నివాసం జప్తు పిటిషన్‌పై ఈనెల 6న తీర్పు