మాస్కో చేరుకున్న చైనా అధ్యక్షుడు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తన మూడు రోజుల రష్యా పర్యటనలో భాగంగా సోమవారం మాస్కోకు చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్న వేళ.. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు అధినేతలూ సోమవారం రాత్రి చర్చలు జరిపారు.

Published : 21 Mar 2023 05:38 IST

రష్యాతో బలమైన బంధమే లక్ష్యం

మాస్కో, బీజింగ్‌: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తన మూడు రోజుల రష్యా పర్యటనలో భాగంగా సోమవారం మాస్కోకు చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్న వేళ.. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు అధినేతలూ సోమవారం రాత్రి చర్చలు జరిపారు. తమ మధ్య గల ‘హద్దుల్లేని స్నేహబంధం’ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా జిన్‌పింగ్‌ పర్యటన సాగుతుందని చైనా, రష్యాలు అభివర్ణించాయి. తమ దేశ ఇంధన అవసరాలైన ముడిచమురు, గ్యాస్‌లకు రష్యాను ప్రధాన వనరుగా చైనా భావిస్తోంది. అలాగే అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించడంలో భాగస్వామిగాను లెక్కిస్తోంది. అధికారులతో కూడిన విస్తృత చర్చలు మంగళవారం జరుగుతాయి. ఉక్రెయిన్‌ నుంచి వేల మంది చిన్నారులను అపహరించారన్న ఆరోపణలతో పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ జారీచేసిన రోజుల వ్యవధిలోనే జిన్‌పింగ్‌ పర్యటన సాగుతుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు