విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రచండ

నేపాల్‌ ప్రధాని ప్రచండ సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. 3 నెలల్లో ఆయనకు ఇది రెండో విశ్వాస పరీక్ష. 275 మంది సభ్యులున్న నేపాల్‌ పార్లమెంటులో 262 మంది ఓటేశారు.

Published : 21 Mar 2023 05:14 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌ ప్రధాని ప్రచండ సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. 3 నెలల్లో ఆయనకు ఇది రెండో విశ్వాస పరీక్ష. 275 మంది సభ్యులున్న నేపాల్‌ పార్లమెంటులో 262 మంది ఓటేశారు. ప్రచండకు 172 ఓట్లు వచ్చాయి. 89 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. 68ఏళ్ల మావోయిస్టు నేత అయిన ప్రచండ గత డిసెంబరులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. జనవరి 10న జరిగిన విశ్వాస పరీక్షలో మొదటిసారి నెగ్గారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని