సంక్షిప్త వార్తలు

ఉక్రెయిన్‌కు మరింతగా సైనిక సాయం అందించడానికి అమెరికా సన్నద్ధమవుతోంది.

Published : 21 Mar 2023 05:32 IST

ఉక్రెయిన్‌కు అమెరికా మరో 35 కోట్ల డాలర్ల సైనిక సాయం

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌కు మరింతగా సైనిక సాయం అందించడానికి అమెరికా సన్నద్ధమవుతోంది. దాదాపు 35 కోట్ల డాలర్ల విలువైన మందుగుండు సామగ్రి, ట్యాంకర్‌ ట్రక్కులు తదితరాలను త్వరలో సరఫరా చేస్తామని అమెరికా అధికారులు తెలిపారు.


తీవ్ర దుర్భిక్షంతో సోమాలియాలో 43 వేల మంది మృతి

వర్షాభావ పరిస్థితులతో ఆకలి చావులు

నైరోబీ: తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న సోమాలియాలో దుర్భిక్షం కారణంగా గతేడాది 43 వేల మంది మృత్యువాత పడినట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. అందులో సగం మంది బాలలే కావడం గమనార్హం. ఈ దుర్భర స్థితి ముగింపు దశకు వచ్చినట్లు కనపడటం లేదని డబ్ల్యూహెచ్‌వో, యూనిసెఫ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ వెలువరించిన ఈ నివేదిక పేర్కొంది. ఆఫ్రికా కొమ్ముగా పిలిచే ప్రాంతంలో ఉన్న సోమాలియా, ఇథియోపియా, కెన్యా దేశాలు వరసగా ఆరో వర్షాభావ సీజన్‌ను ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాలతో ఆహారధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఈ ఏడాది ఆరు నెలలు ముగిసే నాటికి సుమారు 18 వేల మంది మరణించే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమాలియాలో సుమారు అయిదు లక్షల మంది చిన్నారులు పోషకాహారలోపం బారిన పడనున్నారని మరో నివేదిక ఇటీవల హెచ్చరించింది. ఈ దేశానికి ఇప్పటి వరకు అండగా ఉన్న దాతృత్వ దేశాలు ఇప్పుడు తమను పట్టించుకోవడం మానేశాయని ఇక్కడి ఐరాస సమన్వయకర్త ఆడమ్‌ అబ్దెల్‌మౌలా వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారి దృష్టంతా ఉక్రెయిన్‌ మీదకు వెళ్లిపోయిందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు