నా చుట్టూ మృత్యు ఉచ్చు.. వీడియో విచారణ జరపండి

కోర్టు విచారణలకు తాను భౌతికంగా హాజరైతే హత్య చేస్తారని, వీడియో లింకేజీ ద్వారా తన కేసుల వర్చువల్‌ విచారణకు అనుమతించాలని కోరుతూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్థాన్‌ చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌కు లేఖ రాశారు.

Updated : 22 Mar 2023 05:24 IST

పాక్‌ చీఫ్‌ జస్టిస్‌కు ఇమ్రాన్‌ లేఖ

లాహోర్‌: కోర్టు విచారణలకు తాను భౌతికంగా హాజరైతే హత్య చేస్తారని, వీడియో లింకేజీ ద్వారా తన కేసుల వర్చువల్‌ విచారణకు అనుమతించాలని కోరుతూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్థాన్‌ చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌కు లేఖ రాశారు. అదేవిధంగా తన మీద నమోదైన కేసులన్నీ కలిపి విచారించాలని కోరారు. గత శనివారం ఇస్లామాబాద్‌ కోర్టు విచారణకు తాను హాజరైనపుడు దాదాపు 20 మంది ఆగంతుకులు అక్కడ కనిపించారని, తనను హత్య చేసేందుకే వారు అక్కడకు వచ్చినట్లు ఇమ్రాన్‌ మరో ప్రసంగంలో పేర్కొన్నారు. దీనికి ఆధారంగా సాదా దుస్తుల్లో చేతిలో ప్లాస్టిక్‌ తాళ్లతో తిరుగుతున్న కొంతమంది అనుమానితుల వీడియోను ఆయన ప్రదర్శించారు. అత్యంత రక్షణ గల కోర్టు ప్రాంగణంలోకి వారెలా వచ్చారని ప్రశ్నించారు. కాగా, లాహోర్‌ హైకోర్టు ధర్మాసనం తన ఎదుట విచారణలో ఉన్న మూడు కేసుల్లో మార్చి 27 వరకు ఇమ్రాన్‌ఖాన్‌కు బెయిలు మంజూరు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు