‘ఎవర్‌గ్రీన్‌’ ఉద్యోగులకు మరో 10 నెలల బోనస్‌

సాధారణంగా ఉద్యోగులు ఒకట్రెండు నెలల జీతం బోనస్‌గా వస్తేనే ఎంతో సంబరపడిపోతారు.

Published : 22 Mar 2023 05:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఉద్యోగులు ఒకట్రెండు నెలల జీతం బోనస్‌గా వస్తేనే ఎంతో సంబరపడిపోతారు. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్ల వేతనం బోనస్‌గా ఇస్తుంటే ఇంకెంత ఆనందపడిపోతారో కదా.. తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్‌ అనే షిప్పింగ్‌ సంస్థ తమ ఉద్యోగులకు ఇప్పటికే 50 నెలల జీతాన్ని బోనస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 10 నుంచి 11 నెలల వేతనాన్ని బోనస్‌ కింద చెల్లించాలని నిర్ణయించింది. అంటే దాదాపు 5ఏళ్ల జీతాన్ని ఆ సంస్థ ఉద్యోగులు బోనస్‌గా అందుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని