ఆ కథనాన్ని ధ్రువీకరించలేం

గత ఏడాది హిమాలయాల్లో చైనా చేసిన దాడులను విజయవంతంగా తిప్పికొట్టడంలో భారత సైన్యానికి క్రూషియల్‌ రియల్‌ టైమ్‌ ఇంటెలిజెన్స్‌ను అమెరికా అందించిందనే వార్తా కథనాన్ని ధ్రువీకరించేందుకు శ్వేతసౌధం నిరాకరించింది.

Published : 22 Mar 2023 05:43 IST

భారత్‌కు అమెరికా సహకరించిందనే అంశంపై స్పందించిన శ్వేతసౌధం

వాషింగ్టన్‌: గత ఏడాది హిమాలయాల్లో చైనా చేసిన దాడులను విజయవంతంగా తిప్పికొట్టడంలో భారత సైన్యానికి క్రూషియల్‌ రియల్‌ టైమ్‌ ఇంటెలిజెన్స్‌ను అమెరికా అందించిందనే వార్తా కథనాన్ని ధ్రువీకరించేందుకు శ్వేతసౌధం నిరాకరించింది. శ్వేతసౌధంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అమెరికా జాతీయ భద్రతా మండలి కోఆర్డినేటర్‌ జాన్‌ కిర్బీ మాట్లాడుతూ... ‘ఆ కథనాన్ని నేను ధ్రువీకరించలేను’ అని స్పష్టంచేశారు. గత ఏడాది చివర్లో హిమాలయాల్లో సరిహద్దు వెంబడి చైనా చేసిన దాడులను భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టిందని, ఇందుకు అమెరికా అందించిన నిఘా సమాచారం భారత్‌కు ఎంతగానో ఉపయోగపడిందని ‘యుఎస్‌ న్యూస్‌’ అనే వార్తాసంస్థ ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. దీనిపై విలేకరులు ప్రశ్నించగా జాన్‌కిర్బీ స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని