205 ఏళ్ల భవనం.. ధర రూ.2,480 కోట్లు!

లండన్‌లో 205 ఏళ్ల ఓ పురాతన భవనాన్ని అమ్మకానికి పెట్టారు. దాని ధర మన భారతీయ కరెన్సీలో రూ.2480 కోట్లు. దాంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురాతన భవనంగా వార్తల్లో నిలిచింది.

Published : 23 Mar 2023 05:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లండన్‌లో 205 ఏళ్ల ఓ పురాతన భవనాన్ని అమ్మకానికి పెట్టారు. దాని ధర మన భారతీయ కరెన్సీలో రూ.2480 కోట్లు. దాంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురాతన భవనంగా వార్తల్లో నిలిచింది. ఇది చూడటానికి కొంచెం అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్‌ను పోలి ఉంటుంది. అందుకే ఈ రెండంతస్తుల భవనాన్ని ‘వైట్‌ హౌస్‌ ఆఫ్‌ రీజెంట్స్‌ పార్క్‌’ అని పిలుస్తుంటారు. భవనం లోపల 40 పడక గదులున్నాయి. 8 గ్యారేజీలు, టెన్నిస్‌ కోర్టు, ఆవిరి స్నానం చేసుకునేందుకు ఓ ప్రత్యేక గది, గ్రంథాలయం, అతిపెద్ద డైనింగ్‌ రూమ్‌ వంటి సౌకర్యాలున్నాయి. మొత్తం 29 వేల చదరపు అడుగుల లివింగ్‌ స్పేస్‌ ఉంది. జార్జియాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి జేమ్స్‌ బుర్టన్‌ 1818లో దీన్ని నిర్మించారు. అప్పటి నుంచి అనేక మంది చేతులు మారుతూ వస్తోంది. ప్రతి సారి దాని ధర రెట్టింపు అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని