భారత రాయబార కార్యాలయం వద్ద భద్రతను సమీక్షిస్తాం: బ్రిటన్‌

బ్రిటన్‌ రాజధాని లండన్‌లో గల భారత రాయబార కార్యాలయం వద్ద భద్రతను సమీక్షించనున్నట్లు ఆ దేశ విదేశాంగమంత్రి జేమ్స్‌ క్లెవర్లీ వెల్లడించారు.

Published : 24 Mar 2023 05:09 IST

లండన్‌: బ్రిటన్‌ రాజధాని లండన్‌లో గల భారత రాయబార కార్యాలయం వద్ద భద్రతను సమీక్షించనున్నట్లు ఆ దేశ విదేశాంగమంత్రి జేమ్స్‌ క్లెవర్లీ వెల్లడించారు. ఖలిస్థాన్‌ అనుకూలవాదులు ఇండియా హౌస్‌ వద్ద ఆదివారం, బుధవారం హింసాత్మక చర్యలకు దిగిన సంఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, వాటిపై గట్టి ప్రతిచర్యలు తీసుకుంటుందని తెలిపారు. దౌత్యవేత్తల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి మెట్రోపోలీసులతో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని