అమెరికా నౌకను తరిమేశాం: చైనా

అమెరికాకు చెందిన గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ యుద్ధనౌకను దక్షిణ చైనా సముద్రం నుంచి తరిమేసినట్లు గురువారం బీజింగ్‌ ప్రకటించింది.

Updated : 24 Mar 2023 06:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ యుద్ధనౌకను దక్షిణ చైనా సముద్రం నుంచి తరిమేసినట్లు గురువారం బీజింగ్‌ ప్రకటించింది. తమ ప్రాదేశిక జలాల్లోకి ఇది అక్రమంగా ప్రవేశించిందని చైనా ఆరోపించింది. ప్రశాంతంగా ఉన్న వాణిజ్య మార్గంలో శాంతి, స్థిరత్వానికి భంగం వాటిల్లేలా అమెరికా యుద్ధ నౌకలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. దీంతో అమెరికా నౌకను తమ జలాలకు దూరంగా పంపించామని పేర్కొంది. మరోవైపు చైనా ప్రకటనను అమెరికా ఖండించింది. యుద్ధ నౌక దక్షిణ చైనా సముద్రంలో సాధారణ గస్తీ కార్యకలాపాలను నిర్వహిస్తోందని పేర్కొంది. తమ నౌకను ఎవరూ అక్కడి నుంచి పంపించలేదని వెల్లడించింది. భవిష్యత్తులోనూ అమెరికా ఆ ప్రదేశంలోని అంతర్జాతీయ గగనతలం, సముద్ర జలాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని