5 కేసుల్లో ఇమ్రాన్‌ బెయిల్‌ పొడిగింపు

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ (70)కు అయిదు ఉగ్రవాద కేసుల్లో గతంలో ఇచ్చిన ముందస్తు బెయిలు గడువును మార్చి 27 దాకా పొడిగిస్తూ లాహోర్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 25 Mar 2023 04:36 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ (70)కు అయిదు ఉగ్రవాద కేసుల్లో గతంలో ఇచ్చిన ముందస్తు బెయిలు గడువును మార్చి 27 దాకా పొడిగిస్తూ లాహోర్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం పటిష్ఠమైన బందోబస్తు మధ్య ద్విసభ్య ధర్మాసనం ముందు ఇమ్రాన్‌ హాజరయ్యారు. ‘‘నా జీవితం ప్రమాదంలో ఉంది. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా పంజాబ్‌ పోలీసులు లాహోర్‌లోని నా నివాసంపై దాడి చేసి బీభత్సం సృష్టించారు’’ అని ఇమ్రాన్‌ కోర్టుకు నివేదించారు. ఆయన వాదన విన్న న్యాయమూర్తులు పంజాబ్‌ ప్రావిన్సు ప్రభుత్వానికి, పంజాబ్‌ పోలీస్‌ ఐజీకి నోటీసుల జారీకి ఆదేశించారు. గతేడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పడ్డాక పాక్‌లోని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఇమ్రాన్‌పై మొత్తం 143 కేసులు నమోదయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు