సంక్షిప్త వార్తలు (2)

అమెరికా పెన్సిల్వేనియాలోని చాక్లెట్‌ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు.

Updated : 26 Mar 2023 05:51 IST

అమెరికా చాక్లెట్‌ పరిశ్రమలో పేలుడు
ఐదుగురి దుర్మరణం.. మరో ఆరుగురి గల్లంతు

వెస్ట్‌ రీడింగ్‌(అమెరికా): అమెరికా పెన్సిల్వేనియాలోని చాక్లెట్‌ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. ఆర్‌ఎం పామెర్‌ కంపెనీ ప్లాంటులో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు తీవ్రతకు ఒక భవనం నేలమట్టమవడంతో పాటు పక్కనున్న మరో భవనం, అపార్టుమెంట్లు ధ్వంసమయ్యాయి.


బెలారస్‌లో అణ్వాయుధాల్ని మోహరిస్తాం: పుతిన్‌

మాస్కో: వ్యూహాత్మక అణ్వాయుధాల్ని తమ పొరుగుదేశం బెలారస్‌లో మోహరిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శనివారం ప్రకటించారు. యురేనియంతో కూడిన ఆయుధ సామగ్రిని ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తామని బ్రిటన్‌ వారం రోజులుగా ప్రకటిస్తున్నందున తాము ఈ నిర్ణయానికి వచ్చామని రష్యన్‌ టెలివిజన్‌లో మాట్లాడుతూ పుతిన్‌ చెప్పారు. బెలారస్‌లో అణ్వాయుధాల నిల్వకు సంబంధించిన ఏర్పాట్లు జులై ఒకటోతేదీ కల్లా పూర్తవుతాయని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని