ఇమ్రాన్‌కు బెయిల్‌ మంజూరు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు శనివారం ఊరట లభించింది. పోలీసులు నమోదు చేసిన మూడు ఉగ్రవాద కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిలు మంజూరైంది.

Updated : 26 Mar 2023 05:50 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు శనివారం ఊరట లభించింది. పోలీసులు నమోదు చేసిన మూడు ఉగ్రవాద కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిలు మంజూరైంది. ఏప్రిల్‌ 4 వరకూ ఇది అమల్లో ఉంటుందని స్థానిక ఏటీసీ జడ్జి ఇజాజ్‌ అహ్మద్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌.. కోర్టుకు హాజరయ్యారు. తనపై నమోదైన కేసులన్నీ బోగస్‌ అని చెప్పారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని న్యాయమూర్తి మన్నించారు. అయితే ప్రతి విచారణకూ హాజరుకావాలని ఇమ్రాన్‌కు స్పష్టంచేశారు. అలాగే కోర్టు వద్దకు భారీగా మద్దతుదారులను తీసుకురావొద్దని స్పష్టంచేశారు. ‘‘ఈసారి మీ వెంట పెద్ద సంఖ్యలో జనం వస్తే.. నేను కేసు విచారణ చేపట్టను’’ అని హెచ్చరించారు. ఒక కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. దీనిపై ఈ మూడు కేసులు నమోదయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు