Joe Biden: ‘చైనాను అభినందిస్తున్నా.. ’: బైడెన్ వీడియో వైరల్
అమెరికా, చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో చైనాను బైడెన్ పొగడడమేంటా..!
అటావా: అమెరికా, చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో చైనాను బైడెన్ పొగడడమేంటా..! అని ఆశ్చర్యపోతున్నారా..! ఇంతకీ ఏం జరిగిందంటే.. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం జో బైడెన్ తొలిసారి కెనడాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పొరపాటున చైనాను మెచ్చుకున్నారు. ‘‘వలసల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నందుకు.. చైనాను అభినందిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. వెంటనే, జరిగిన పొరపాటుకు నాలుక్కర్చుకున్న బైడెన్.. ‘‘క్షమించండి.. కెనడాను అభినందిస్తున్నా’’ అని అన్నారు. దీంతో పార్లమెంటు సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. తన పొరపాటును సరిదిద్దుకుని.. ‘‘చైనా గురించి నేనేం ఆలోచిస్తున్నానో మీరు చెప్పగలరు. ఇంకా ఈ విషయంలోకి వెళ్లదల్చుకోలేదు’’ అంటూ బైడెన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Heart Disease: రోజూ 50 మెట్లు ఎక్కండి.. గుండె జబ్బు ముప్పు తగ్గించుకోండి!
-
‘1,400 ఎకరాల డీల్ కోసమే సీఎం జగన్తో అదానీ రహస్య భేటీ’
-
వైతెపా విలీనంపై 4 రోజుల్లో దిల్లీ నుంచి పిలుపు!
-
పాపులర్ అవ్వడానికి బదులు దూరమయ్యా: జాన్వీకపూర్
-
నేటి నుంచి ఆన్లైన్ గేమింగ్ పూర్తి పందెం విలువపై 28% జీఎస్టీ
-
‘ఆస్కార్ విజేత’ పింకీ.. ఇపుడు నవ్వటం లేదు!