గాల్లో అతి సమీపంలోకి వచ్చిన విమానాలు

గగనతలంలో ప్రయాణిస్తున్న రెండు విమానాలకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో వారు సకాలంలో స్పందించి ప్రమాదాన్ని నివారించగలిగారు.

Published : 27 Mar 2023 07:40 IST

నేపాల్‌లో పైలట్ల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

కాఠ్‌మాండూ: గగనతలంలో ప్రయాణిస్తున్న రెండు విమానాలకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో వారు సకాలంలో స్పందించి ప్రమాదాన్ని నివారించగలిగారు. శుక్రవారం ఉదయం నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఏ-320 విమానం మలేసియాలోని కౌలాలంపుర్‌ నుంచి కాఠ్‌మాండూకు వస్తోంది. దిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా విమానం కాఠ్‌మాండూకు వెళ్తోంది. ఈ రెండూ కాఠ్‌మాండూకు చేరుకున్న సమయంలో గాలిలో దాదాపు ఢీకొనేంతగా సమీపంలోకి వచ్చాయి. ఎయిర్‌ ఇండియా విమానం 19 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగుతుండగా.. నేపాల్‌ విమానం అదే ప్రాంతంలో 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. రెండూ అత్యంత సమీపంలో ఉన్నాయని గుర్తించిన హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో నేపాల్‌ విమానం 7 వేల అడుగుల మేర కిందకు దిగింది. దీంతో ప్రమాదం తప్పింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లను సస్పెండ్‌ చేసినట్లు నేపాల్‌ పౌర విమానయాన ప్రాధికార సంస్థ తెలిపింది. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ నియమించినట్లు పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు