అమెరికాలో ఖలిస్థాన్‌ మద్దతుదారుల వీరంగం

అమెరికాలో ఖలిస్థాన్‌ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. శనివారం ఇక్కడి భారత రాయబార కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తూ.. హింసను ప్రేరేపించే ప్రసంగాలు చేశారు.

Published : 27 Mar 2023 03:42 IST

భారత పాత్రికేయుడిపై దాడి
వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంలో చొరబాటుకు యత్నం

వాషింగ్టన్‌: అమెరికాలో ఖలిస్థాన్‌ మద్దతుదారులు వీరంగం సృష్టించారు. శనివారం ఇక్కడి భారత రాయబార కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తూ.. హింసను ప్రేరేపించే ప్రసంగాలు చేశారు. భారత రాయబారి తరణ్‌జీత్‌సింగ్‌ సంధూను అసభ్యకరపదజాలంతో దూషించారు. రాయబార కార్యాలయ ప్రాంగణంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. భారత్‌కు చెందిన పీటీఐ పాత్రికేయుడు లలిత్‌ కుమార్‌ ఝాపైనా ఆందోళనకారులు భౌతికంగా దాడికి దిగారు. ఆ సమయంలో అమెరికా సీక్రెట్‌ సర్వీసు అధికారులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను వెనక్కి నెట్టారు. ఒకానొక సమయంలో రాయబార కార్యాలయంలోని మువ్వన్నెల జెండాను లాగేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని స్థానిక పోలీసులు వమ్ము చేశారు.

కెనడా హైకమిషనర్‌కు సమన్లు

దిల్లీ: కెనడా హైకమిషనర్‌ కామెరూన్‌ మెక్‌కేను శనివారం విదేశీ వ్యవహారాలశాఖ పిలిపించింది. ఇటీవల కెనడాలో భారత దౌత్యకార్యాలయాల ముందు ఖలిస్థాన్‌ మద్దతుదారుల నిరసనలు.. వారిని స్థానిక పోలీసులు నియంత్రించకపోవడాన్ని మెక్‌కే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా విదేశీవ్యవహారాలశాఖ అధికారులు తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని