ఇమ్రాన్‌ పార్టీ ఆదేశాలను అధ్యక్షుడు పాటిస్తున్నారు

ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి నడుచుకుంటున్నారని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు.

Updated : 27 Mar 2023 05:44 IST

ఆరిఫ్‌ అల్విపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ ఆరోపణలు 

ఇస్లామాబాద్‌: ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి నడుచుకుంటున్నారని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు. దేశాధ్యక్షుడిగా తటస్థంగా ఉండకుండా, ఇమ్రాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ కార్యకర్తల నిరసనలను అణచివేసే క్రమంలో అసాధారణ రీతిలో పోలీసులను ప్రయోగించిన విషయాన్ని తప్పుపడుతూ ఆరిఫ్‌ షెహబాజ్‌కు లేఖ రాశారు. దీనిపై షెహబాజ్‌  ఘాటుగా స్పందించారు. ఆరిఫ్‌ అధ్యక్షుడు కాకముందు పీటీఐలో కొనసాగారు.

పాక్‌ను గట్టెక్కించేందుకు ఇమ్రాన్‌ పది అంశాల ప్రణాళిక

ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్‌ను కాపాడేందుకు ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ 10 అంశాల ప్రణాళికను ప్రకటించారు. లాహోర్‌లో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. విదేశాల్లో ఉన్న పాకిస్థానీలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహకాలు అందిస్తామని, దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగి, రుణం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌)ను అభ్యర్థించాల్సిన అవసరం తప్పుతుందని ఇమ్రాన్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు