పుతిన్‌ అణు హెచ్చరికను తేలిగ్గా తీసుకోవద్దు

బెలారస్‌లో అణ్వాయుధాలను మోహరిస్తామని రష్యా చేసిన ప్రకటనను తేలిగ్గా తీసుకోవద్దని అంతర్జాతీయ సమాజాన్ని ఉక్రెయిన్‌ హెచ్చరించింది.

Published : 27 Mar 2023 04:28 IST

ఐరాస అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయండి
అంతర్జాతీయ సమాజానికి ఉక్రెయిన్‌ విజ్ఞప్తి

కీవ్‌/వాషింగ్టన్‌: బెలారస్‌లో అణ్వాయుధాలను మోహరిస్తామని రష్యా చేసిన ప్రకటనను తేలిగ్గా తీసుకోవద్దని అంతర్జాతీయ సమాజాన్ని ఉక్రెయిన్‌ హెచ్చరించింది. తక్షణమే ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని డిమాండు చేసింది. ప్రపంచాన్ని బ్లాక్‌మెయిల్‌ చేయాలని పుతిన్‌ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పేర్కొంది. రష్యా బెదిరింపులను అమెరికా మాత్రం తేలిగ్గా తీసుకుంది. అణ్వాయుధాలను రష్యా ప్రయోగిస్తుందని తాము అనుకోవడం లేదని పెంటగాన్‌ తెలిపింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, మాస్కో తన అణ్వాయుధాలను కదలిస్తున్నట్లు కూడా సమాచారం లేదని చెప్పింది. పుతిన్‌ మోహరింపు ప్రకటనను జర్మనీ ఖండించింది. కవ్వింపు చర్యలకు పుతిన్‌ పాల్పడుతున్నారని ఆరోపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు