తైవాన్‌తో తెగదెంపులు.. చైనాతో హోండురస్‌ దోస్తీ

తైవాన్‌తో దశాబ్దాలుగా ఉన్న సంబంధాలను తెంచుకుని చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు హోండురస్‌ ప్రకటించింది.

Published : 27 Mar 2023 04:28 IST

బీజింగ్‌: తైవాన్‌తో దశాబ్దాలుగా ఉన్న సంబంధాలను తెంచుకుని చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు హోండురస్‌ ప్రకటించింది. చైనాలో అంతర్భాగంగానే తైవాన్‌ ఉందనీ, అందువల్ల ఇకపై తైవాన్‌తో ఎలాంటి అధికారిక సంప్రదింపులు ఉండబోవని హోండురస్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ట్విటర్లో తెలిపింది. తమ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని కాపాడుకునేందుకు హోండరస్‌తో సంబంధాలు తెంచుకుంటున్నామని తైవాన్‌ కూడా ప్రకటన వెలువరించింది. తమ దేశంతో దౌత్య బంధం కొనసాగించేందుకు హోండురస్‌ 245 కోట్ల డాలర్ల సొమ్మును డిమాండ్‌ చేసిందని తైవాన్‌ విదేశాంగమంత్రి ఆరోపించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని