అమెరికా బడిలో యువతి కాల్పులు.. ముగ్గురు పిల్లలు సహా ఆరుగురి మృతి

అగ్రరాజ్యంలో ఓ పాఠశాలలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Published : 28 Mar 2023 04:49 IST

నాష్‌విల్‌ (అమెరికా): అగ్రరాజ్యంలో ఓ పాఠశాలలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నాష్‌విల్‌లోని ఓ మిషినరీ పాఠశాలలో జరిగిన ఈ ఘటనలో టీనేజి నిందితురాలు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇది ఆత్మహత్యా, లేదంటే పోలీసు కాల్పులు దీనికి దారితీశాయా అనేది వెంటనే స్పష్టంకాలేదు. నిందితురాలు రెండు తుపాకీలు, ఒక పిస్తోలుతో వచ్చి పిల్లలపై కాల్పులకు దిగింది. ఈ ఘటనానంతరం ఇతర విద్యార్థుల్ని సమీపంలోని చర్చి భవనంలోకి తరలించారు. పూర్వవిద్య నుంచి ఆరో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు చదువుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు