ప్రజాగ్రహానికి దిగొచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని

సంస్కరణల పేరుతో న్యాయవ్యవస్థ స్వతంత్రతను, న్యాయమూర్తుల అధికారాలను దెబ్బతీసేలా చట్టాలను తేవాలని ప్రయత్నించిన ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహు.

Published : 28 Mar 2023 04:49 IST

న్యాయ సంస్కరణలపై వెనక్కి తగ్గిన నెతన్యాహు
వీధుల్లో కదం తొక్కిన లక్షలమంది ఆందోళనకారులు

జెరూసలెం: సంస్కరణల పేరుతో న్యాయవ్యవస్థ స్వతంత్రతను, న్యాయమూర్తుల అధికారాలను దెబ్బతీసేలా చట్టాలను తేవాలని ప్రయత్నించిన ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహు.. ప్రజాగ్రహానికి తలొగ్గాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతిపాదిత సంస్కరణలపై తీవ్ర నిరసన వ్యక్తమవ్వడంతో వచ్చే పార్లమెంటు సమావేశాల వరకు వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. అంతకుముందు సంస్కరణలకు వ్యతిరేకంగా గళమెత్తిన రక్షణ మంత్రి గాలెంట్‌ను నెతన్యాహు తొలగించడంతో నిరసనకారులు రెచ్చిపోయారు. లక్షలమంది రోడ్లపై ఆందోళనలకు దిగారు. టెల్‌ అవీవ్‌లో ప్రధాన రహదారిపై మంట వేసి దేశ జెండాలు పట్టుకుని నెతన్యాహుకు వ్యతిరేకంగా నినదించారు. ఇజ్రాయెల్‌ అట్టుడుకుపోయింది. ఆందోళనకారులపై పోలీసులు బాష్ప వాయుగోళాలు, జల ఫిరంగులను ప్రయోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని