అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం 2.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

Published : 28 Mar 2023 04:59 IST

ఇద్దరి మధ్య ఘర్షణ.. తీవ్ర గాయాలు

న్యూయార్క్‌: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం 2.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి షరీఫ్‌ కార్యాలయ ప్రతినిధి సార్జెంట్‌ అమర్‌ గాంధీ తెలిపిన వివరాల ప్రకారం.. గురుద్వారా మైదానంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. వారిలో ఒకరు ప్రత్యర్థికి చెందిన స్నేహితుడిని తుపాకీతో కాల్చాడు. తరువాత మొదటి వ్యక్తి రెండో అతనిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఇది విద్వేషపూరిత ఘటన కాదని, ఘర్షణ పడిన ఇద్దరూ ఒకరికి ఒకరు ముందే తెలుసునని అమర్‌ గాంధీ వెల్లడించారు. తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఇద్దరూ దక్షిణ శాక్రమెంటోలోని కైసర్‌ పర్మినెంటి హాస్పిటల్‌లో చేరారు. వారిద్దరికీ ప్రాణాపాయం లేని గాయాలైనట్లు తెలిసింది. కాల్పులు జరిపిన వారిలో ఒకరు భారత సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు