ప్రారంభమైన అమెరికా-ద.కొరియా సైనిక విన్యాసాలు

అమెరికా పంపిన విమాన వాహకనౌక, దాని అనుబంధ యుద్ధ నౌకలతో కలిసి దక్షిణ కొరియా యుద్ధ నౌకలు సైనిక విన్యాసాలు ప్రారంభించాయి.

Published : 28 Mar 2023 05:04 IST

రెండు క్షిపణులను ప్రయోగించిన ఉ.కొరియా

సియోల్‌: అమెరికా పంపిన విమాన వాహకనౌక, దాని అనుబంధ యుద్ధ నౌకలతో కలిసి దక్షిణ కొరియా యుద్ధ నౌకలు సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. ఈ పరిణామాలపై గుర్రుగా ఉన్న ఉత్తర కొరియా.. సోమవారం ఈ విన్యాసాలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా-ద.కొరియా సైనిక విన్యాసాలు, ఉ.కొరియా ప్రతీకార క్షిపణి ప్రయోగాలతో కొరియా ద్వీపకల్ప వాతావరణం వేడెక్కింది. మరీ ముఖ్యంగా అణు ఇంధన విమానవాహక నౌక యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌ రాకకు నిరసనగానే ఉ.కొరియా క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధ క్షేత్ర సమన్వయాన్ని మెరుగుపర్చుకోవడం, అమెరికా తన మిత్రపక్షాల రక్షణకు ఎంత అండగా ఉండనుందో చాటిచెప్పడానికే ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నామని ద.కొరియా నేవీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు