ఉల్క శకలాలతో హ్యాండ్‌ బ్యాగ్‌

ఫ్రాన్స్‌కు చెందిన విలాస ఉత్పత్తుల సంస్థ ‘కోపర్నీ’ ఓ వినూత్న హ్యాండ్‌ బ్యాగ్‌ను అమ్మకానికి పెట్టింది. వేల ఏళ్ల క్రితం భూమిపై పడ్డ ఉల్క శకలాలతో తయారుకావడం దీని ప్రత్యేకత.

Published : 28 Mar 2023 05:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్రాన్స్‌కు చెందిన విలాస ఉత్పత్తుల సంస్థ ‘కోపర్నీ’ ఓ వినూత్న హ్యాండ్‌ బ్యాగ్‌ను అమ్మకానికి పెట్టింది. వేల ఏళ్ల క్రితం భూమిపై పడ్డ ఉల్క శకలాలతో తయారుకావడం దీని ప్రత్యేకత. ఒక్కో బ్యాగ్‌ ఖరీదు 43వేల డాలర్లు (సుమారు రూ.35 లక్షలు). బ్యాగ్‌ డిజైన్‌లో శాస్త్రీయత, ఆదిమ కళ ఉట్టిపడేలా కోపర్నీ జాగ్రత్తలు తీసుకొంది. ఇది చూడ్డానికి సున్నితంగా కాకుండా గరుకుగా కనిపిస్తోంది. ఉల్క శకలాలు చెక్కి మలిచినందువల్ల అలా ఉందని కంపెనీ వెల్లడించింది. దానికి ‘మిని మీటియోరైట్‌ స్వైప్‌ బ్యాగ్‌’ అని నామకరణం చేసింది. బ్యాగ్‌ బరువు సుమారు 2 కిలోలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు