ఇదిగో ఉ.కొరియా అణుబాంబు!
ఉత్తర కొరియా వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని చెబుతుంటే వినడమే తప్ప.. ప్రపంచం చూసింది లేదు. ఇన్నాళ్లూ అణు హెచ్చరికలకే పరిమితమైన ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు స్వయంగా ఆ విధ్వంసకర అస్త్రాలను ప్రదర్శించారు.
ప్రదర్శించిన దేశాధ్యక్షుడు కిమ్
ప్యాంగాంగ్: ఉత్తర కొరియా వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని చెబుతుంటే వినడమే తప్ప.. ప్రపంచం చూసింది లేదు. ఇన్నాళ్లూ అణు హెచ్చరికలకే పరిమితమైన ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు స్వయంగా ఆ విధ్వంసకర అస్త్రాలను ప్రదర్శించారు. తమ దేశంలోని అణ్వాయుధ సంస్థను సందర్శించిన ఆయన.. అక్కడున్న వివిధ రకాల అణు వార్‌హెడ్లను పరిశీలించారు. ఆ ఫొటోలను ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ కేసీఎన్‌ఏ విడుదల చేసింది. అక్కడ కొత్త రకం ట్యాక్టికల్ వార్‌హెడ్‌లు కూడా ఉన్నాయి. స్వల్పశ్రేణి క్షిపణులు సహా అనేక అస్త్రాల్లో అమర్చేలా ఈ చిన్నపాటి బాంబులను రూపొందించినట్లు స్పష్టమవుతోంది. దక్షిణ కొరియా లక్ష్యంగా రూపొందిన వీటికి హ్వాసన్-31 అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఖండాంతర క్షిపణుల్లో అమర్చేలా వార్‌హెడ్‌ల పరిమాణాన్ని బాగా కుదించడంలో ఉత్తర కొరియా పురోగతి సాధించినట్లు ఈ చిత్రాలు సూచిస్తున్నాయి. యుద్ధనౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేసే సామర్థ్యమున్న భారీ టోర్పిడో కూడా అక్కడ కనిపించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
India News
Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!