వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు.. ఇప్పుడు చిక్కులు..
నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వైద్యుడు వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు. ఇప్పుడు అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది.
నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వైద్యుడు వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు. ఇప్పుడు అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇకపై అతడు వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలని పేర్కొంటూ ఓ మహిళ కోర్టులో కేసు వేశారు. ఈ మహిళ సైతం ఆయన వీర్యాన్ని ఉపయోగించే బిడ్డకు జన్మనిచ్చారు. ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. ఇప్పటివరకు నెదర్లాండ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్‌లలో వీర్యదానం చేశాడు. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. వీర్యదానం ద్వారా జొనథన్ వంద మందికి పైగా చిన్నారులకు జన్మనిచ్చాడని 2017లోనే తెలిసింది. దీంతో నెదర్లాండ్స్ యంత్రాంగం అప్రమత్తమైంది. ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఎన్‌వీఓజీ) అతడిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. జొనథన్ ప్రస్తుతం కెన్యాలో ఉన్నట్టు నెదర్లాండ్స్ మీడియా వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Delhi Liquor Policy Case: ఈడీ అధికారులు బెదిరించడం వల్లే కవిత పేరు చెప్పారు
-
General News
Odisha Train Accident : అక్కడి వాతావరణం భీతావహం.. ‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
Train Accidents: దశాబ్దకాలంలో జరిగిన పెను రైలు ప్రమాదాలివీ..
-
Ap-top-news News
AP IIIT Admissions 2023: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు వేళాయె
-
Ap-top-news News
Odisha Train Accident: ఏపీ ప్రయాణికులు ఎందరో?