‘అణు’ ఉత్పత్తి పెంపునకు కిమ్‌ పిలుపు!

బాంబుల తయారీకి అవసరమైన అణు పదార్థాల ఉత్పత్తిని పెంచాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆ దేశ అణు శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.

Updated : 29 Mar 2023 05:16 IST

సియోల్‌: బాంబుల తయారీకి అవసరమైన అణు పదార్థాల ఉత్పత్తిని పెంచాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆ దేశ అణు శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ మీడియా కేసీఎన్‌ఏ మంగళవారం ఓ కథనం ప్రచురించింది. మార్చిలో ఆ దేశం ఆవిష్కరించిన 7 క్షిపణుల వివరాలను అందులో పేర్కొంది. కిమ్‌ సోమవారం ఆ దేశ న్యూక్లియర్‌ వెపన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అణుశాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ రకాల వార్‌హెడ్లు, ఆయుధాలను ప్రదర్శనకు ఉంచిన హాల్‌లో అధికారులతో కిమ్‌ మాట్లాడుతున్న చిత్రాలను కేసీఎన్‌ఏ ప్రచురించింది. మరోవైపు.. సునామీని పుట్టించే అణు సామర్థ్యమున్న అండర్‌ వాటర్‌ డ్రోన్‌ ‘హెయిల్‌’ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. దీనికి సంబంధించిన దృశ్యాలనూ విడుదల చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు