మక్కాకు వెళ్తున్న బస్సులో మంటలు: సౌదీలో 20 మంది మృత్యువాత

సౌదీ అరేబియాలో ఘోరం జరిగింది. పవిత్ర మక్కాకు వెళ్తున్న ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది మృత్యువాతపడ్డారు.

Updated : 29 Mar 2023 06:09 IST

రియాధ్‌: సౌదీ అరేబియాలో ఘోరం జరిగింది. పవిత్ర మక్కాకు వెళ్తున్న ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 29 మంది గాయపడ్డారు. నైరుతి రాష్ట్రమైన యాసిర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిలవడంతో బస్సు అదుపు తప్పి ఓ వంతెనను ఢీకొట్టి బోల్తా పడింది. అనంతరం అందులో మంటలు చెలరేగాయి. అగ్నికీలల తీవ్రతకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులోనివారంతా హజ్‌ యాత్రికులే. క్షతగాత్రులను అధికారులు స్థానిక ఆసుపత్రులకు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు