పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా.. ఫ్రాన్స్‌లో మిన్నంటిన ఆందోళనలు

ప్రజా వ్యతిరేక పింఛను సంస్కరణలను నిరసిస్తూ మంగళవారం యావత్‌ ఫ్రాన్స్‌లో మరోసారి ఆందోళనలు మిన్నంటాయి.

Published : 29 Mar 2023 05:46 IST

పారిస్‌: ప్రజా వ్యతిరేక పింఛను సంస్కరణలను నిరసిస్తూ మంగళవారం యావత్‌ ఫ్రాన్స్‌లో మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. ఈ నిరసనలు హింసాత్మకంగా మారే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీగా బలగాలను మోహరించింది. ఆందోళనకారులు నిర్వహించే ప్రదర్శనలు హింసకు దారి తీసే అవకాశం ఉందన్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు సుమారు 13 వేల మంది పోలీసు అధికారులను నియమించామని ఇందులో సగం మంది ఫ్రెంచి రాజధానిలోనే విధులు నిర్వహిస్తున్నారని ఆ దేశ మంత్రి గెరాల్డ్‌ డార్మానిన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని