గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట: పాకిస్థాన్‌లో 11 మంది మృత్యువాత

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సు జిల్లాల్లో ఉచితంగా గోధుమ పిండి పంపిణీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటుచేసుకుని ఇటీవల కాలంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 30 Mar 2023 06:04 IST

లాహోర్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సు జిల్లాల్లో ఉచితంగా గోధుమ పిండి పంపిణీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటుచేసుకుని ఇటీవల కాలంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ పంజాబ్‌లోని సాహివాల్‌, బహవల్‌పూర్‌, ముజఫర్‌గఢ్‌, ఒకారా, ఫసైలాబాద్‌, జెహానియన్‌, ముల్తాన్‌ జిల్లాల్లోని కేంద్రాల వద్ద ఇటీవల కాలంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తొక్కిసలాటల్లో మొత్తం 11 మంది ప్రజలు మృత్యువాతపడ్డారని అధికారులు వెల్లడించారు. తాజాగా మంగళవారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్‌ ప్రభుత్వం పంజాబ్‌ ప్రావిన్సులో పేదల కోసం ఉచిత పిండి పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రాల వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండటంతో తొక్కిసలాటలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని