సంక్షిప్త వార్తలు
కొవిడ్‌ను కలిగించే సార్స్‌కోవ్2 వైరస్‌తో పాటు దాని రూపాంతరాలైన డెల్టా, ఒమిక్రాన్‌ల పనిపట్టే మాలిక్యూల్(అణువు)ను అమెరికాలోని హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు.
కొవిడ్‌పై ‘అణ్వ’స్త్రం
హ్యూస్టన్: కొవిడ్‌ను కలిగించే సార్స్‌కోవ్2 వైరస్‌తో పాటు దాని రూపాంతరాలైన డెల్టా, ఒమిక్రాన్‌ల పనిపట్టే మాలిక్యూల్(అణువు)ను అమెరికాలోని హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. ఫైజర్ సంస్థ విడుదలచేసిన ప్యాక్స్‌లోవిడ్ మాత్రలను కొవిడ్ లక్షణాలు కనిపించిన మొదటి మూడు రోజుల్లో వాడితేనే ఫలితం కనిపిస్తుంది. హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు కనిపెట్టిన సి.డి.04872ఎస్.సి. మాలిక్యూల్ కొవిడ్ కారక వైరస్‌పై తక్షణం పనిచేసి దాని ఆటకట్టిస్తుంది. ఇది అన్ని వయసులవారికీ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా టీకాలు తీసుకున్నా తగు సంఖ్యలో యాంటీబాడీలు ఉత్పన్నంకాని దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు, వృద్ధులకు గొప్ప రక్షా కవచంలా నిలుస్తుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న రోజుల్లో హ్యూస్టన్ బృందం పరిశోధకులు వైరస్‌ను అడ్డుకోగల మాలిక్యూల్ కోసం 15,09,984 రసాయనాలను గాలించారు. చివరకు కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్‌కూ మానవ శరీరంలోని ఏస్ 2 రిసెప్టర్‌కూ మధ్య లంకె ఏర్పడకుండా నిరోధించగల 15 మాలిక్యూల్స్‌ను వడపోశారు. వాటన్నింటిలోకీ సి.డి.04872ఎస్.సి. అత్యంత సమర్థంగా లంకెను తెగ్గొడుతుందని నిర్ధారించారు.
బ్రెజిల్‌లో 7 లక్షలు దాటిన కొవిడ్ మరణాలు
సావొపాలో: కొవిడ్ మరణాల్లో బ్రెజిల్ ప్రపంచ దేశాల్లో రెండో స్థానానికి చేరింది. అక్కడ కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 7 లక్షలు దాటినట్లు బ్రెజిల్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 11 లక్షలకుపైగా మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకోని కారణంగానే ప్రస్తుతం బ్రెజిల్‌లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య మంత్రి నిసియా ట్రిండాడే విజ్ఞప్తి చేశారు.
హెచ్-1బి, ఎల్-1 వీసాల సంస్కరణకు అమెరికాలో సవరణ చట్టం
వాషింగ్టన్: విదేశీ ఉద్యోగుల నియామకాల కోసం ఉద్దేశించిన హెచ్-1బి, ఎల్-1 వీసాల తీరును సంస్కరించడంతో పాటు వీటి మంజూరులో మరింత పారదర్శకతను పెంచేందుకు అమెరికా సెనెట్‌లో కొందరు సభ్యులు సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా సెనెట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్-1బి, ఎల్-1 వీసాల సంస్కరణ చట్టం ఇమ్మిగ్రేషన్ విధానంలోని మోసాలు, దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు అమెరికాలోని ఉద్యోగులు, వీసాదారులకు రక్షణ కల్పిస్తుందని ఓ మీడియా తెలిపింది.
పురుష శరణార్థులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్న గార్డులు
మెక్సికో అగ్నిప్రమాద ఘటనపై బాధితుల ఆరోపణలు
మెక్సికో సిటీ: మెక్సికో-అమెరికా సరిహద్దు నగరం సియూడడ్ వారెజ్‌లోని శరణార్థుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై బాధితులు పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు గార్డులు మహిళా శరణార్థులను బయటకు వెళ్లడానికి అనుమతించినప్పటికీ పురుషులు ఉన్న సెల్‌ను మాత్రం తెరవలేదని బాధితులు వాపోయారు. దీంతో ఆ గదులు మొత్తం పొగతో నిండిపోయి వారంతా మరణించారని ప్రమాదం నుంచి బయటపడిన వియాంగ్లీ ఇన్‌ఫాంటే పాడ్రోన్ అనే మహిళ తెలిపారు. ప్రమాదం సంభవించిన తొలి నిమిషాల్లో బయటకు పరుగు పరుగున వచ్చింది మహిళలు, ఇమిగ్రేషన్ ఉద్యోగులేనని ఆమె తెలిపారు. ఇమిగ్రేషన్ అధికారులు సైతం తమ ప్రకటనలో పురుష శరణార్థుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రమాదంలో ఉన్నది నిందితులా, దోషులా, వారు పారిపోతారా లేదా అనే అంశాలతో సంబంధం లేకుండా అందరినీ కాపాడి ఉండాల్సిందని మానవహక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 38 మంది మరణించగా 28 మంది గాయాలపాలయ్యారు. మరోవైపు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కోసం పోప్ ఫ్రాన్సిస్ బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/06/23)