మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు

ఇజ్రాయెల్‌ న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు వెనక్కు తగ్గుతారని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించడం తాజాగా తీవ్ర దుమారానికి తెరలేపింది.

Updated : 30 Mar 2023 06:16 IST

అమెరికాకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఘాటు సూచన

జెరూసలెం: ఇజ్రాయెల్‌ న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు వెనక్కు తగ్గుతారని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించడం తాజాగా తీవ్ర దుమారానికి తెరలేపింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ బైడెన్‌కు నెతన్యాహు బుధవారం కాస్త గట్టిగానే సూచించారు. తమ నిర్ణయాలు తామే తీసుకుంటామన్నారు. ఇజ్రాయెల్‌ న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం నెతన్యాహు చేసిన ప్రతిపాదనలపై దేశవ్యాప్తంగా ప్రజలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై బైడెన్‌ స్పందిస్తూ.. మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌లో ప్రజాస్వామ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల విషయంలో ప్రధాని రాజీకి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆయన వ్యాఖ్యలను తాజాగా నెతన్యాహు తిప్పికొట్టారు. తమది సార్వభౌమత్వ దేశమన్నారు. ప్రజల అభీష్ట మేరకే నిర్ణయం తీసుకుంటామని, విదేశాల ఒత్తిడి ఆధారంగా కాదని స్పష్టం చేశారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు హితవు పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు