60 శాతం తగ్గిన పర్యాటక వీసాల ఇంటర్వ్యూల నిరీక్షణ కాలం

అమెరికా పర్యటనకు వెళ్లే భారతీయుల వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ కాలం ఈ ఏడాది 60 శాతం తగ్గినట్లు అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి జూలీ స్టఫ్ట్‌ తెలిపారు.

Published : 30 Mar 2023 05:53 IST

అమెరికా వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికా పర్యటనకు వెళ్లే భారతీయుల వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ కాలం ఈ ఏడాది 60 శాతం తగ్గినట్లు అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి జూలీ స్టఫ్ట్‌ తెలిపారు. బైడెన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. గత అక్టోబరులో బీ1 (బిజినెస్‌)/బీ2 (పర్యాటక) వీసా ఇంటర్వ్యూల నిరీక్షణ కాలం సుమారు వెయ్యి రోజులుంది. మొదటిసారి వీసా కోసం చేసిన దరఖాస్తులకు మోక్షం లభించడానికి, ముఖ్యంగా బీ1, బీ2 వీసాలకు సుదీర్ఘమైన నిరీక్షణ కాలం ఉండటంపై భారత్‌లో కొంతకాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిరీక్షణ కాలం తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు అమెరికా తెలిపింది. ‘‘భారత్‌లో అధికారుల సంఖ్యను పెంచాం. గతంలో ఎప్పుడూ లేనట్టుగా బ్యాంకాక్‌ లాంటి చోట సైతం భారతీయులకు వీసా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌లో కొత్త కాన్సులేట్‌ భవనాన్ని ప్రారంభించాం’’ అని జూలీ స్టఫ్ట్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని