మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్‌ పితామహుడు మార్టిన్‌ కూపర్‌ ఆవేదన

మొబైల్‌ వాడకంలో విశృంఖలత్వం పెరిగిపోయిందని ‘సెల్‌ఫోన్‌ పితామహుడు’ మార్టిన్‌ కూపర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 31 Mar 2023 04:41 IST

దిల్లీ: మొబైల్‌ వాడకంలో విశృంఖలత్వం పెరిగిపోయిందని ‘సెల్‌ఫోన్‌ పితామహుడు’ మార్టిన్‌ కూపర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 1973 ఏప్రిల్‌ 3న ఈ అమెరికన్‌ ఇంజినీర్‌ తొలిసారి తాను తయారుచేసిన మొబైల్‌లో సంభాషించారు. ఆ మొబైలే.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌గా రూపాంతరం చెంది మానవ సమాచార వ్యవస్థను సమూలంగా మార్చేసింది. అందుకే అందరూ మార్టిన్‌ను ‘సెల్‌ఫోన్‌ పితామహుడు’ అంటారు. అయితే ప్రస్తుతం పలువురు సెల్‌ఫోన్‌ వాడుతున్న తీరుపై మార్టిన్‌ సంతృప్తిగా లేరు. ‘‘మరీ ఎక్కువగా వినియోగిస్తున్నారు. సెల్‌ఫోన్‌ చూస్తూ ఎవరైనా రోడ్డు దాటడం చూస్తే.. బాధేస్తుంది. వ్యామోహం ఎక్కువైంది’’ అని మార్టిన్‌ పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌తో ప్రయోజనాలూ భవిష్యత్తులో భారీగా ఉంటాయని కూపర్‌ తెలిపారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఎంతో చక్కగా కనిపిస్తోన్న ఈ పరికరం.. ఏదో ఒకరోజు వ్యాధులను జయించడానికి దోహదం చేస్తుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని