ఓడలో అగ్నిప్రమాదం.. 31 మంది మృతి

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓడలో మంటలు చెలరేగడంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 31 Mar 2023 05:11 IST

 ఫిలిప్పీన్స్‌లో దుర్ఘటన

మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓడలో మంటలు చెలరేగడంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. 23 మంది గాయపడ్డారు. బాసిలన్‌ ప్రావిన్సులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జాంబోంగా నుంచి సులు ప్రావిన్స్‌లోని జోలో పట్టణానికి ఓడ వెళ్తుండగా అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. భయాందోళనలకు లోనై నీటిలో పడి కొందరు.. అగ్నికీలల్లో చిక్కుకుని మరికొందరు మరణించారు. ప్రాణభయంతో నీటిలో దూకినవారిలో చాలా మందిని నేవీ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు రక్షించారు. దగ్ధమైన ఓడను బాసిలన్‌ తీరానికి అధికారులు చేర్చారు. ఓడ క్యాబిన్‌లో 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు