అమెరికాలో ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

శిక్షణకు వినియోగిస్తున్న రెండు సైనిక హెలికాప్టర్లు ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని కెంటకీలో బుధవారం రాత్రి సంభవించింది.

Published : 31 Mar 2023 05:11 IST

9 మంది మృతి

ఫోర్ట్‌ క్యాంప్‌బెల్‌: శిక్షణకు వినియోగిస్తున్న రెండు సైనిక హెలికాప్టర్లు ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని కెంటకీలో బుధవారం రాత్రి సంభవించింది. అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించిన సమాచారం ప్రకారం...బుధవారం రాత్రి 10 గంటల సమయంలో హెచ్‌హెచ్‌-60 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లు రెండు పరస్పరం ఢీకొన్నాయి. ఆ సమయంలో రెండింటిలో కలిపి తొమ్మిది మంది సైనికులు ఉన్నారు. శిక్షణలో భాగంగా ఒక దాని వెంట మరొకటిగా వెళ్లిన హెలికాప్టర్లు కొద్ది సమయం తర్వాత ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు