సంక్షిప్త వార్తలు(2)
అరెస్టు చేసిన వాల్‌స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టు ఇవాన్ గెర్ష్‌కోవిక్‌ను వెంటనే విడుదల చేయాలని రష్యాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు.
అమెరికా జర్నలిస్టును వదిలిపెట్టండి
రష్యాకు బైడెన్ సూచన
వాషింగ్టన్: అరెస్టు చేసిన వాల్‌స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టు ఇవాన్ గెర్ష్‌కోవిక్‌ను వెంటనే విడుదల చేయాలని రష్యాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. అమెరికా పౌరుడైన గెర్ష్‌కోవిక్ గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ రష్యా నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. ఈ నేపథ్యంలో గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో స్పందించాలని కోరగా.. అతడిని విడిచి పెట్టండంటూ రష్యాకు బైడెన్ సూచించారు. జర్నలిస్టు అరెస్టుపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘దీనిని మేం సహించబోం. తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ప్రస్తుతం ఆఫ్రికాలోని జాంబియాలో పర్యటిస్తున్న ఆమె స్పష్టం చేశారు.
బెలారస్‌లో రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాలు!
టాలిన్: రష్యా తన వ్యూహాత్మక అణు ఆయుధాగారం యోచనలో భాగంగా తమ దేశంలోనూ అణ్వాయుధాలను మోహరించే అవకాశం ఉందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో శుక్రవారం ప్రకటించారు. అదే గనుక జరిగితే మరింత పెద్ద ముప్పు పొంచి ఉన్నట్లేనని అభివర్ణించారు. బెలారస్‌లో స్వల్పశ్రేణి, తక్కువస్థాయి అణ్వాయుధాలను వ్యూహాత్మకంగా మోహరిస్తామని గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించిన సంగతి గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్