ట్రంప్‌పై నేరాభియోగాలు
అగ్రరాజ్యం అమెరికా రాజకీయ చరిత్రలో సంచలనం. పోర్న్ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నేరాభియోగాల నమోదుకు మన్‌హటన్ గ్రాండ్ జ్యూరీ గురువారం అనుమతించింది.
నమోదుకు మన్‌హటన్ గ్రాండ్ జ్యూరీ అనుమతి
పోర్న్ స్టార్‌కు డబ్బుల చెల్లింపు కేసులో కీలక పరిణామం
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా రాజకీయ చరిత్రలో సంచలనం. పోర్న్ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నేరాభియోగాల నమోదుకు మన్‌హటన్ గ్రాండ్ జ్యూరీ గురువారం అనుమతించింది. దీంతో అమెరికా చరిత్రలో నేర విచారణను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ఆయన నిలవనున్నారు. ఈ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ట్రంప్ కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ కేసేమీ అడ్డంకి కాబోదని స్పష్టమవుతోంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం... క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని ఎక్కడా లేదు. కేవలం కేసులు ఎదుర్కోవటమే కాదు... ఆ కేసుల్లో దోషిగా తేలి, జైలు శిక్ష పడ్డా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేవారికి క్రిమినల్ రికార్డు ఉండకూడదనే నిబంధనేదీ అక్కడి రాజ్యాంగంలో లేదు. మన్‌హటన్ కోర్టులో ట్రంప్ లొంగిపోయేందుకు వీలుగా ఆయన న్యాయవాదులను గురువారం సంప్రదించామని దర్యాప్తును పర్యవేక్షిస్తున్న మన్‌హటన్ అటార్నీ అల్విన్ బ్రాగ్ ప్రతినిధి వెల్లడించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో 45వ అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన 76 ఏళ్ల ట్రంప్ సోమవారం తానుంటున్న ఫ్లోరిడా నుంచి న్యూయార్క్‌కు రానున్నారు. మంగళవారం కోర్టులో లొంగిపోయే అవకాశముంది. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఆయనపై నమోదైన నేరాభియోగాలను చదివి వినిపిస్తారు. ట్రంప్ లొంగిపోతే.. ఆయనను అరెస్టు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తారు. ఆ తర్వాత విచారించి అరెస్టు నివేదిక తయారు చేస్తారు. సాధారణంగా సామాన్య నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడానికి సంకెళ్లు వేసి తీసుకొస్తారు. ట్రంప్ మాజీ అధ్యక్షుడైనందున ఆయనకు కొన్ని మినహాయింపులు కల్పించే అవకాశాలున్నాయి.
బెయిలు వచ్చే అవకాశముందా?
ట్రంప్‌పై ఎలాంటి అభియోగాలు మోపారన్న దానిపై ఇంకా స్పష్టతలేదు. ఈ కేసుపై కోర్టులో ఆయన తన వాదనలు వినిపించుకునే అవకాశముంటుంది. తనపై నేరాభియోగాలను సవాలు చేస్తూ ఆధారాలను చూపిస్తే.. తదుపరి విచారణ జరుగుతుంది. దానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చు. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన అభియోగాలు తీవ్రంగా లేకపోతే ఆయనకు జరిమానా విధిస్తారు. దీంతో ఆయన అదే రోజు విడుదల కావొచ్చు. తీవ్రంగా ఉంటే.. నాలుగేళ్ల వరకూ జైలు శిక్ష విధించొచ్చు.
ఇది కుట్రే: ట్రంప్
రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి న్యాయ వ్యవస్థను డెమోక్రాట్లు ఆయుధంగా మలుచుకున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘డెమోక్రాట్లు అబద్ధాలు చెప్పారు. మోసం చేశారు. ట్రంప్‌ను ఇరికించేందుకు కుట్ర పన్నారు. ఇప్పుడు ఊహించని రీతిలో నాపై అభియోగాలను మోపారు. ఇది ఎన్నికల్లో చొరబాటుకు చేస్తున్న కుట్రే’ అని ట్రంప్ మండిపడ్డారు.
ఇదీ కేసు..
2006లో తనతో పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ ఒప్పందం చేసుకున్నారు. ఆయన తన మాజీ న్యాయవాది మైఖేల్ కొహెన్ ద్వారా 1,30,000 డాలర్లను డేనియల్స్‌కు చెల్లించారు. ఆ తర్వాత 2017-21 కాలంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ మధ్యకాలంలో పలు ఆరోపణలతో అరెస్టైన న్యాయవాది కొహెన్ తాను డేనియల్స్‌తో ఒప్పందంలో భాగంగానే డబ్బు చెల్లించానని అంగీకరించారు. మరోవైపు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ డేనియల్స్ కోర్టుకెక్కారు. దీంతో ట్రంప్‌పై అభియోగాలకు రంగం సిద్ధమైంది.
మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు: డేనియల్స్
ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచిన వారికి పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కృతజ్ఞతలు తెలిపారు. చాలామంది తనకు సందేశాలు పంపుతున్నారని, వాటికి సమాధానమిచ్చే స్థితిలో లేనని పేర్కొన్నారు. తానేమీ సంబరాలు జరుపుకోవడం లేదని తెలిపారు. ఇది సంతోషకర సమయం కాదని, వాస్తవాలు బయటకు రావాలని డేనియల్స్ న్యాయవాది క్లార్క్ బ్లూస్టర్ అభిప్రాయపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
-
Movies News
ప్రేక్షకులకు గుడ్‌న్యూస్: థియేటర్లో విడుదలైన రోజే కొత్త సినిమా ఇంట్లో చూసేయొచ్చు!
-
Sports News
CSK: పారితోషికం తక్కువ.. పెర్ఫామెన్స్ ఎక్కువ.. ఆ చెన్నై ప్లేయర్స్ ఎవరంటే?
-
World News
Imran Khan: నాలుగో భార్యనవుతా.. ఇమ్రాన్‌ఖాన్‌కు టిక్‌టాకర్ ప్రపోజల్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Pawan kalyan: పవన్ షూ రూ.లక్ష.. అక్షయ్ బ్యాక్‌ప్యాక్ రూ.35వేలు.. ఇదే టాక్ ఆఫ్ ది టౌన్!