మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
చైనాలోని ఏక సంతాన విధానం వల్ల తన తల్లి అనుభవించిన బాధను ఓ యువతి ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఆమె ట్వీట్లు చూసినవారు ‘హృదయవిదారకం’ అంటూ సందేశాలు పెడుతున్నారు.
చైనా యువతి ఆవేదన
బీజింగ్: చైనాలోని ఏక సంతాన విధానం వల్ల తన తల్లి అనుభవించిన బాధను ఓ యువతి ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ఆమె ట్వీట్లు చూసినవారు ‘హృదయవిదారకం’ అంటూ సందేశాలు పెడుతున్నారు. చైనాలో దశాబ్దాలుగా కొనసాగిన ఈ కఠిన నిబంధన ఎందరో తల్లుల జీవితాల్లో వేదనను మిగిల్చింది. ఒకరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఈ నిబంధనను వెనక్కి తీసుకున్నా.. దానివల్ల కలిగిన మానసిక కలవరం అక్కడి తల్లుల మదిలో నుంచి చెరిగిపోలేదు. దీనికి సంబంధించి డాక్టర్ చెన్‌చెన్ ఝాంగ్ అనే యువతి తన తల్లి రాసుకున్న డైరీలోని కొన్ని పేజీలను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘34 ఏళ్ల క్రితం అమ్మ రాసిన డైరీలోని కొన్ని పేజీలివి. రెండు నెలల వయసున్న నా చెల్లిని అమ్మమ్మ వద్దకు పంపేటప్పుడు కన్నీటితో రాసుకున్న పదాలివి. తన చిన్నారి వెళ్లిపోయేముందు మరోసారి పాలు పట్టిన విషయాన్ని అమ్మ డైరీలో రాసుకుంది. అప్పుడు నా వయసు ఏడాదిన్నరే. చెల్లికి అయిదారేళ్లు వచ్చాక మళ్లీ మా వద్దకు వచ్చింది. గుండెలు మెలిపెట్టే ఇలాంటి ఎన్నో గాథలున్న చైనా కుటుంబాల్లో మాదీ ఒకటి’ అని చెన్‌చెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు
-
Movies News
Vishwak Sen: అందుకే పేరు మార్చుకున్నా: విశ్వక్ సేన్
-
World News
Ukraine: జెలెన్స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’ పాటకు దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
India News
Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు