అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి
అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరికన్ కీలక పదవిని అలంకరించనున్నారు. అమెరికా విదేశాంగ శాఖలో శక్తిమంతమైన డిప్యూటీ సెక్రటరీ(నిర్వహణ, వనరులు) పదవికి ప్రముఖ న్యాయవాది.
విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగా రిచర్డ్ వర్మ
ఆయన నామినేషన్‌ను ఆమోదించిన సెనెట్
వాషింగ్టన్: అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరికన్ కీలక పదవిని అలంకరించనున్నారు. అమెరికా విదేశాంగ శాఖలో శక్తిమంతమైన డిప్యూటీ సెక్రటరీ(నిర్వహణ, వనరులు) పదవికి ప్రముఖ న్యాయవాది, దౌత్యవేత్త రిచర్డ్ వర్మ(54) నామినేషన్‌ను సెనెట్ ఆమోదించింది. గురువారం నిర్వహించిన ఓటింగ్‌లో 67-26 మెజార్టీతో ఆమోదం తెలిపింది. ఈ హోదాను విదేశాంగ శాఖ సీఈవోగా పరిగణిస్తారు. రిచర్డ్ వర్మ 2015-2017 మధ్య భారత్‌లో అమెరికా రాయబారిగా సేవలు అందించారు. ప్రస్తుతం మాస్టర్‌కార్డ్ సంస్థకు ప్రధాన న్యాయ వ్యవహారాల అధికారిగా, ప్రపంచ ప్రజా విధానాల విభాగ అధిపతిగా ఉన్నారు. ఒబామా హయాంలో విదేశాంగ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ(చట్ట వ్యవహారాలు)గా వ్యవహరించారు. అంతకు ముందు సెనెటర్ హారీ రెడ్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా సేవలందించారు. ఆసియా గ్రూప్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరికొన్ని సంస్థల్లోనూ వివిధ హోదాల్లో కొనసాగారు. అమెరికా వైమానిక దళంలో జడ్జి అడ్వొకేట్‌గా పనిచేశారు. అధ్యక్షుడి నిఘా సలహా బోర్డులో సేవలందించారు. సామూహిక విధ్వంస ఆయుధాలు, ఉగ్రవాద నిరోధక కమిషన్‌లో సభ్యుడిగా కొనసాగారు. ఫోర్డ్ ఫౌండేషన్ ట్రస్టీగానూ, మరికొన్ని సంస్థల బోర్డుల్లో సభ్యుడిగానూ ఉన్నారు. అమెరికాకు వలస వచ్చిన ఓ భారతీయ కుటుంబంలో 1968లో జన్మించిన రిచర్డ్ వర్మ పెన్సిల్వేనియాలో పెరిగారు. జార్జిటౌన్ యూనివర్సిటీ లా సెంటర్‌లో న్యాయవాద విద్యలో పీజీ, జార్జిటౌన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. తన సేవలకుగానూ విదేశాంగ శాఖ, విదేశీ వ్యవహారాల మండలి, వైమానిక దళం నుంచి పురస్కారాలు అందుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Vijayawada: చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడగడం తప్పా?: బొప్పరాజు
-
World News
Putin: పశ్చిమ దేశాలను కాదని.. పుతిన్‌కు అండగా దక్షిణాఫ్రికా..!
-
World News
China: రికార్డు స్థాయికి.. చైనా యువత నిరుద్యోగిత రేటు
-
Movies News
Ram Charan: రామ్ చరణ్‌తో ఎలాంటి విభేదాలు లేవు..: బాలీవుడ్ డైరెక్టర్
-
Sports News
CSK vs GT: ఇదంతా ‘మహి’మే: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు
-
General News
వీసీ ఛాంబర్లో టేబుల్‌పై కూర్చొని.. తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆందోళన