జైలుకెళ్లినా పోటీ చేయొచ్చు!
పోర్న్ స్టార్‌కు ముడుపుల వ్యవహారంలో అభియోగాలు నమోదైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం ఏంటి? 2024లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాటపడుతున్న.
ట్రంప్ 2024 ఆశలకు ఇబ్బందేమీ లేదు
వాషింగ్టన్: పోర్న్ స్టార్‌కు ముడుపుల వ్యవహారంలో అభియోగాలు నమోదైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం ఏంటి? 2024లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాటపడుతున్న ఆయన ఆశలిక అడియాసలైనట్లేనా? పోటీకి దూరంగా ఉండాల్సిందేనా? అంటే... అదేం లేదనే సమాధానం వస్తోంది. నేరం రుజువై జైలుకెళ్లినా అధ్యక్ష పదవికి అర్హుడే అంటోంది అమెరికా రాజ్యాంగం!
పరువు నష్టం కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష పడగానే మన దగ్గర రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం తక్షణమే రద్దయింది. అంతేకాదు.. ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యారాయన! మరి పోర్న్ స్టార్‌కు ముడుపుల కేసులో కోర్టు ముందు లొంగిపోబోతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవటం సహజం.
ఆ మూడూ ఉంటే చాలు...
ప్రస్తుతానికి ట్రంప్ క్రిమినల్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం... క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని ఎక్కడా లేదు. కేవలం కేసులు ఎదుర్కోవడమే కాదు.. ఆ కేసుల్లో దోషిగా తేలి, జైలు శిక్ష పడ్డా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే... మూడు అర్హతలు కీలకం.
1. ఆ దేశంలో పుట్టిన పౌరుడై ఉండాలి.
2. వయసు 35 ఏళ్లు నిండాలి.
3. పోటీ చేసే నాటికి అమెరికాలో కనీసం 14 ఏళ్లు నివసించాలి.
ఈ మూడూ ఉన్నవారెవరైనా అధ్యక్ష ఎన్నికకు పోటీ చేయొచ్చు. క్రిమినల్ కేసులున్నా, కేసుల్లో శిక్ష పడ్డా... జైలులో ఉన్నా పోటీ చేయొచ్చు. క్రిమినల్ కేసుల్లో శిక్ష అనేది అధ్యక్ష పదవికి అనర్హత కానే కాదు. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం... దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినవారు మాత్రమే పోటీకి అనర్హులు.
సానుభూతికి వాడుకునే అవకాశం
పోర్న్ స్టార్ కేసువల్ల సాంకేతికంగానైతే 2024 ఎన్నికల్లో పోటీ చేయటానికి ట్రంప్‌నకు ఎలాంటి ఇబ్బందీ లేదు. నైతికంగా రిపబ్లికన్ పార్టీ ఆయనను అభ్యర్థిగా నిలబెడుతుందా అనేది ఆసక్తికరం.. ప్రస్తుతానికైతే ఈ కేసు విషయంలో రిపబ్లికన్ పార్టీ నేతలంతా ఆయనకు మద్దతిస్తున్నారు. అధ్యక్ష బరిలో నిలవాలని ఆశిస్తున్న నేతలూ ఈ కేసు విషయంలో ట్రంప్‌నకు మద్దతుగా ప్రకటనలివ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేసును తనకు అనుకూలంగా, సానుభూతి సంపాదించేలా ట్రంప్ మలచుకునే అవకాశం లేకపోలేదన్నది విశ్లేషకుల మాట. ఇప్పటికే బైడెన్ సారథ్యంలోని డెమొక్రాట్లు న్యాయ వ్యవస్థను రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారని రిపబ్లికన్ పార్టీ ఆరోపిస్తోంది.
ఎవరిపైనా లేనన్ని కేసులు
అమెరికా మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ కేసులో అభియోగాలు నమోదవడం ఇదే తొలిసారి. నిజానికి ట్రంప్‌పై ఈ కేసు ఒక్కటే కాదు. మరో మూడు క్రిమినల్ కేసుల్లోనూ ఆయన అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
1. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారన్నది ఒక ఆరోపణ. దీనిపై జార్జియాలోని ప్రత్యేక గ్రాండ్ జ్యూరీ ఇప్పటికే పలువురిపై అభియోగాలు నమోదు చేయాలని రహస్య నివేదిక సమర్పించింది.
2. పదవి నుంచి దిగిపోయే ముందు అధికార రహస్య పత్రాలను అప్పగించకుండా ఇంటికి తీసుకెళ్లారన్నది ట్రంప్‌పై రెండో ఆరోపణ. దీనిపై ఇప్పటికే ఎఫ్‌బీఐ ట్రంప్ ఇంట్లో సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. తెలిసే వీటిని ట్రంప్ తీసుకెళ్లారా? రహస్య చట్టాలకు విరుద్ధంగా కావాలనే వీటిని తనతో ఉంచుకున్నారా? దర్యాప్తును అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
3. 2020 జనవరి 6న అమెరికా కాంగ్రెస్‌పై రిపబ్లికన్ మూకల దాడి కేసు మూడోది. ట్రంప్ రెచ్చగొట్టినందునే ఈ దాడి జరిగిందన్నది ఆరోపణ. ఇందుకు సంబంధించి ట్రంప్ పాత్రపై సాక్ష్యాలు సేకరించడంలో అమెరికా న్యాయ విభాగం తలమునకలై ఉంది. ఇప్పటికే ప్రత్యేక కౌన్సిల్ విచారణ మొదలు పెట్టింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Road Accident: పుష్ప-2 షూటింగ్ నుంచి వస్తుండగా ప్రమాదం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ