కెనడా సరిహద్దుల్లోని నదిలో బోటు తిరగబడి ఆరుగురి మృతి

కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ భారతీయ కుటుంబానికి చెందిన కొందరు సభ్యులు సహా ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

Published : 01 Apr 2023 05:03 IST

మృతుల్లో భారతీయులు

టొరంటో: కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ భారతీయ కుటుంబానికి చెందిన కొందరు సభ్యులు సహా ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సెయింట్‌ లారెన్స్‌ నదిలో వారంతా ప్రయాణిస్తున్న బోటు తిరగబడటంతో మునిగిపోయి చనిపోయినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. క్యూబెక్‌ సమీపంలోని మార్షి ప్రాంతంలో వారి మృతదేహాలను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతిచెందిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. గల్లంతైన మరో శిశువు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు భారతీయ, రొమేనియాలకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన వారుగా భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు