ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఇద్దరి మృతి

ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై బాంబుల దాడికి రష్యా శుక్రవారం తన దీర్ఘశ్రేణి ఆయుధాలను వినియోగించింది. ఈ క్రమంలో ఇద్దరు పౌరులు మృతి చెందగా.. పలు నివాసాలు ధ్వంసమయ్యాయి.

Published : 01 Apr 2023 06:11 IST

బుచా: ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై బాంబుల దాడికి రష్యా శుక్రవారం తన దీర్ఘశ్రేణి ఆయుధాలను వినియోగించింది. ఈ క్రమంలో ఇద్దరు పౌరులు మృతి చెందగా.. పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్లు బుచా విముక్తి వార్షికోత్సవం జరుపుకొంటున్న వేళ రష్యా భీకర దాడులకు పాల్పడటం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం దండయాత్ర మొదలు పెట్టిన సందర్భంగా పాల్పడిన అకృత్యాలకు రాజధాని కీవ్‌ సమీపంలోని బుచా పట్టణం నిదర్శనంగా నిలిచిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివర్ణించారు. నేరస్థులందరినీ శిక్షించి తీరుతామని సామాజిక మాధ్యమం టెలిగ్రాంలో పేర్కొన్నారు. మరోపక్క బుచాలో జరిగిన అధికారిక విముక్తి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. దీనికి మాల్డోవా అధ్యక్షుడు, క్రొయేషియా, స్లోవేకియా, స్లోవేనియా ప్రధానులు హాజరయ్యారు. రష్యా బుచా ఆక్రమణ సందర్భంగా 37 మంది చిన్నారులు సహా 1400 మంది పౌరులు మృత్యువాత పడ్డారని జెలెన్‌స్కీ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు