ఉప్పు వాడకం తగ్గించాల్సిందే

ఉప్పు ఎక్కువగా తీసుకొంటే మెడ, గుండెలోని రక్తనాళాలు గట్టిపడి గుండె పోటు, పక్షవాతం సంభవిస్తాయని ఐరోపా హృద్రోగ చికిత్సా నిపుణుల పత్రిక ఓపెన్‌లో శనివారం ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.

Updated : 02 Apr 2023 12:53 IST

వాషింగ్టన్‌: ఉప్పు ఎక్కువగా తీసుకొంటే మెడ, గుండెలోని రక్తనాళాలు గట్టిపడి గుండె పోటు, పక్షవాతం సంభవిస్తాయని ఐరోపా హృద్రోగ చికిత్సా నిపుణుల పత్రిక ఓపెన్‌లో శనివారం ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. పూడిక వల్ల ధమనులు ముడుచుకుపోయి గట్టిపడే వ్యాధిని ఎథీరో స్క్లెరోసిస్‌ అంటారు. ఇలా పూడుకుపోయిన రక్తనాళాలు హృదయానికి, మెదడుకు తగు పరిమాణంలో రక్తాన్ని సరఫరా చేయలేకపోతాయి. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వంటివి సంభవిస్తాయి. విపరీతమైన ఉప్పు వాడకానికీ, ఎథీరో స్క్లెరోసిస్‌కూ మధ్య సంబంధం ఉందని మొట్టమొదటిసారి అధ్యయనం ద్వారా నిర్ధారించామని స్వీడన్‌కు చెందిన డాక్టర్‌ జోనాస్‌ వూపియో వివరించారు. ఉప్పు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువగా ఎథీరో స్క్లెరోసిస్‌ ఏర్పడుతుందన్నారు. అధిక రక్తపోటు ఏర్పడక ముందే ఉప్పు వాడకం శరీరానికి హాని కలిగించడం మొదలుపెడుతుంది. అందుకే రోజుకు ఒక చెంచా కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని డబ్ల్యూహెచ్‌వో సలహా ఇస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని