బుల్లెట్‌ ప్రూఫ్‌ హెల్మెట్‌తో కోర్టుకు ఇమ్రాన్‌

ఉగ్రవాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కోర్టుకు హాజరయ్యారు.

Published : 06 Apr 2023 05:19 IST

లాహోర్‌: ఉగ్రవాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కోర్టుకు హాజరయ్యారు. భారీ భద్రత నడుమ ఆయన లాహోర్‌ కోర్టుకు వచ్చిన వీడియోలను పాకిస్థాన్‌ తెహ్రీక్‌- ఏ- ఇన్సాఫ్‌ పార్టీ ట్విటర్‌లో షేర్‌ చేసింది. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని.. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేనని, కేసు విచారణ ఆన్‌లైన్‌లో జరపాలని ఇమ్రాన్‌ఖాన్‌ గతంలో న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయనకు గట్టి భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ కోర్టుకు హాజరయ్యేందుకు పోలీసులు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను అడ్డుపెట్టి భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, మూడు కేసుల్లో లాహోర్‌ కోర్టు ఇమ్రాన్‌ఖాన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని