US Visas: ఈ ఏడాది 10లక్షలకు పైగా అమెరికా వీసాలు
భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మన దేశానికి చెందినవారికి రికార్డు స్థాయిలో 10 లక్షలకుపైగా వీసాలను జారీ చేయనున్నట్లు తెలిపింది.
భారతీయులకు అగ్రరాజ్యం తీపికబురు
వాషింగ్టన్: భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మన దేశానికి చెందినవారికి రికార్డు స్థాయిలో 10 లక్షలకుపైగా వీసాలను జారీ చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ వీసాల ఆమోద ప్రక్రియను పూర్తి చేస్తామంది. అమెరికాకు చదువుల కోసం వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. భారతీయులు అధికంగా కోరుకునే హెచ్-1బీ, ఎల్ వర్క్ వీసాల జారీకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖలో సహాయ కార్యదర్శి డొనాల్డ్‌లు మాట్లాడుతూ... ‘‘భారత్, అమెరికాల ఆర్థిక వ్యవస్థలకు కీలకమైన వర్క్ వీసాలకు మేం ప్రాధాన్యం ఇస్తున్నాం. వీటి జారీకి భారత్‌లోని కొన్ని కాన్సులేట్‌లలో 60 రోజుల కన్నా తక్కువ సమయమే పడుతోంది’’ అని తెలిపారు. కొన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల రెన్యువల్‌కు పిటిషన్‌దారు స్వయంగా హాజరు కావాల్సి ఉండగా, ఇలాంటి వాటిని దేశీయంగానే పునరుద్ధరించే ప్రక్రియను ఈ ఏడాది చివర్లో ప్రయోగాత్మకంగా తిరిగి అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. హెచ్-1బీ వీసాలు ఉండీ ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ నిపుణులు తమ హోదాను పునరుద్ధరించుకోవడానికి ఏమేం చేయాలో సూచిస్తూ... అమెరికన్ హోంల్యాండ్ సెక్యూరిటీ విధివిధానాలను విడుదల చేసిందని పేర్కొన్నారు. ‘‘భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు అమెరికాలో గొప్ప మద్దతు ఉంది. భారతీయ అమెరికన్లు గత మూడు దశాబ్దాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. ప్రతి ఏడాది 10 లక్షల మందికి పైగా ప్రజలు ఇరుదేశాల మధ్య ప్రయాణిస్తూ ఉంటారు. ప్రస్తుతం లక్ష మంది వరకు అమెరికన్లు భారత్‌లోనూ నివసిస్తున్నారు’’ అని డొనాల్డ్ లు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్ తోడిన ఘటన.. ఆ నీళ్లకు డబ్బులు వసూలు చేయండి..!
-
India News
Congress MP: తండ్రి చనిపోయిన 2 రోజులకే.. ఎంపీ ఆకస్మిక మృతి
-
Crime News
Hyderabad: డ్రైవర్‌కు గుండెపోటు.. కారును ఢీకొట్టిన లారీ
-
India News
Manish Sisodia: ఆరోపణలు తీవ్రమైనవి.. బెయిల్ ఇవ్వలేం : సిసోదియాకు హైకోర్టు షాక్
-
Sports News
CSK vs GT: పరిస్థితి ఎలా ఉన్నా.. అతడి వద్ద ఓ ప్లాన్ పక్కా!
-
Crime News
Delhi: సాక్షి హంతకుడిని పట్టించిన ఫోన్‌కాల్..!