Rishi Sunak: రిషి సునాక్ పార్టీకి ఎదురుదెబ్బ
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఎదురుదెబ్బ తగిలింది. కౌన్సిల్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో ఆ పార్టీ ఓటమి దిశగా సాగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఎదురుదెబ్బ తగిలింది. కౌన్సిల్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో ఆ పార్టీ ఓటమి దిశగా సాగుతోంది. ఇంగ్లాండ్‌లో 230 స్థానిక సంస్థల్లోని 8 వేలకు పైగా కౌన్సిల్ సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. రిషి సునాక్ ప్రధాని పీఠమెక్కిన తర్వాత నిర్వహించిన తొలి ఎన్నికలు ఇవే కావడంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. అయితే తొలి ఎన్నికల పరీక్షలో సునాక్‌కు ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీకన్నా ప్రతిపక్ష లేబర్ పార్టీనే ఎక్కువ సీట్లు గెలుచుకొని మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే అధికార కన్జర్వేటివ్ పార్టీ ఇప్పటికే దాదాపు 250 స్థానాలను కోల్పోయింది. కన్జర్వేటివ్ పార్టీ 20 ఏళ్లుగా గెలుస్తున్న మెడ్‌వే సహా మరికొన్ని కీలక స్థానాలను లేబర్ పార్టీ కైవసం చేసుకోవడం గమనార్హం. మరో ప్రతిపక్ష పార్టీ లిబరల్ డెమోక్రటిక్ కూడా మెరుగైన స్థానాలను దక్కించుకుంది.ఫలితాల సరళిని చూస్తుంటే అధికార పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతున్నట్లే కన్పిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!