విడాకులు తీసుకొంటున్న ఫిన్లాండ్‌ ప్రధాని సనా

పిన్న వయసులో ఫిన్లాండ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మారిన్‌ (37) విడాకులు తీసుకోనున్నారు.

Published : 12 May 2023 05:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిన్న వయసులో ఫిన్లాండ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మారిన్‌ (37) విడాకులు తీసుకోనున్నారు. భర్త మార్కస్‌ రైకోనెన్‌తో తన మూడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ప్రకటించారు. వారికి ఒక కుమార్తె ఉంది. వ్యాపారవేత్త మార్కస్‌ రైకోనెస్‌తో సనా మారిన్‌ కొన్నాళ్లపాటు సహజీవనం చేశారు. సనా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత 2020లో వీరు పెళ్లి చేసుకున్నారు.  ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో సనా మారిన్‌ పార్టీ ఓటమిపాలై కన్జర్వేటివ్‌ పార్టీ (ఎన్‌సీపీ) విజయం సాధించింది. త్వరలోనే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అప్పటిదాకా సనా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని