రష్యా భూభాగాలను ఆక్రమించం.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

రష్యా ఆక్రమించిన భూభాగాలను సాధించుకోవడమే లక్ష్యంగా తాము ఎదురుదాడి ప్రణాళికలను రచిస్తున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

Updated : 15 May 2023 05:56 IST

 

బెర్లిన్‌: రష్యా ఆక్రమించిన భూభాగాలను సాధించుకోవడమే లక్ష్యంగా తాము ఎదురుదాడి ప్రణాళికలను రచిస్తున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. తాము రష్యా ప్రాంతాలపై కన్నేయలేదని తెలిపారు. ఆదివారం జెలెన్‌స్కీ జర్మనీ చేరుకున్నారు. ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రష్యా భూభాగాలపై దాడి చేయం. మాకు చెందిన ప్రాంతాలనే విముక్తి చేసుకుంటాం. మాకు మాస్కోపై దాడి చేసే సమయమూ లేదు. అంత ఆయుధశక్తీ లేదు’’ అని పేర్కొన్నారు. రష్యా ప్రాంతాలను ఆక్రమించేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తోందని, తర్వాత శాంతి చర్చల్లో వాటిని బేరసారాలుకు వాడుకోనుందని వస్తున్న ఊహాగానాలు నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ వివరణ ఇచ్చారు.

హఠాత్తుగా పారిస్‌ సందర్శన

పారిస్‌: జెలెన్‌స్కీ ఆదివారం హఠాత్తుగా ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు చేరుకున్నారు. రష్యా బలగాలపై ఎదురుదాడి చేయడం కోసం పాశ్చాత్యదేశాల మద్దతును కోరుతున్న ఉక్రెయిన్‌- ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ను అదనపు సైనిక సాయం అర్థించడానికే పారిస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని