Harry and Markle: హ్యారీ దంపతులను వెంటాడిన మీడియా.. 2 గంటలపాటు నరకం

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ తనయుడు హ్యారీ, ఆయన సతీమణి మెర్కెల్‌ను మీడియా ప్రతినిధులు(పాపరాజీ) కారులో వెంటాడి నరకం చూపించారు.

Updated : 18 May 2023 07:47 IST

నాడు ఇలాగే తల్లి డయానాకు వేధింపులు

న్యూయార్క్‌: బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ తనయుడు హ్యారీ, ఆయన సతీమణి మెర్కెల్‌ను మీడియా ప్రతినిధులు(పాపరాజీ) కారులో వెంటాడి నరకం చూపించారు. న్యూయార్క్‌లో దాదాపు 2 గంటలపాటు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మంగళవారం రాత్రి ఒక అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం హ్యారీ, మెర్కెల్‌, ఆమె తల్లి డోరియా రగ్లాడ్‌లు వెళ్తుండగా మీడియా ప్రతినిధులు వెంబడించారు. సుమారు 2 గంటలపాటు జరిగిన ఈ ఛేజ్‌లో ఇతర కార్లను, పాదచారులను, ఇద్దరు న్యూయార్క్‌ పోలీసులను ఢీకొట్టబోయారని, త్రుటిలో ప్రమాదాలు తప్పాయని హ్యారీ దంపతుల అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన చిత్రాల్లో హ్యారీ, మెర్కెల్‌, రగ్లాడ్‌ ట్యాక్సీలో ఉన్నట్లు కనిపించింది. 1997 ఆగస్టులో హ్యారీ తల్లి డయానాను ఇలాగే మీడియా ప్రతినిధులు పారిస్‌లో వెంబడించడంతో ఆమె కారు ప్రమాదానికి గురై మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని